Extra Ordinary Man | టాలీవుడ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం Extra Ordinary Man. ఈ చిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. యాక...
Extra Ordinary Man | టాలీవుడ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం Extra Ordinary Man. ఈ చిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా, సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. డిసెంబర్ 8న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సినిమా సెన్సార్ తాజా అప్‌డేట్ ఇక్కడ ఉంది.
సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చిందని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇదిలా ఉంటే... "ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్" నిడివి 156 నిమిషాలు (2 గంటల 36 నిమిషాలు). కామెడీ, మాస్ కంటెంట్ ఉన్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్. నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్‌పై సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నితిన్ స్మగ్లర్‌గా కనిపించనున్నట్టు సమాచారం.
.png)
No comments